పీహెచ్సీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Feb 21,2024 16:03 #Kadapa
PHC services should be utilized

– నక్కలదిన్నెలో రూ.2.40 కోట్లతో నూతన పిహెచ్ సీ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే
ప్రజాశక్తి – చాపాడు :
మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీహెచ్ సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి సూచించారు. బుధవారం రూ. 2.40 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన పిహెచ్ సి భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేందుకు ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా చాపాడు మండలానికి నక్కల దీన్నే గ్రామానికి నూతన పిహెచ్ సీని మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఇద్దరు వైద్యులను, సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అన్ని రకాల వసతులతో పిహెచ్ సీ నిర్మాణం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్ సీకి అవసరమైన సామాగ్రి ,ఇతర చిన్నపాటి సమస్యలను వారం రోజులలోగా పరిష్కరిస్తామని తెలిపారు. పిహెచ్ సీ నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా అందజేసిన పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి,వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఎంపిపి టి లక్ష్ముమయ్య ,జిల్లా వైద్యాధికారి నాగరాజు ,ఆర్ అండ్ బి ఎస్ సి పి మహేశ్వర్ రెడ్డి, ఈఈ డివి నరసింహారెడ్డి, డిఈ కంబగిరి, తహశీల్దార్ భూషణం, ఎంపిడిఓ మహబూబ్ బీ, ఈఓపీఆర్డీ రాధాకృష్ణవేణి, ఏఈ దాదాభాష ,వైద్య ఆరోగ్యశాఖ ఎపిడమాలజిస్ట్ ఖాజా మొహిద్దిన్, ఎంపి హెచ్ ఓ కే ఎస్ వి ప్రసాద్, కాంట్రాక్టర్ పాణ్యం నాగమణి రెడ్డి, సంఘం హరినాథ్ రెడ్డి, జడ్పిటిసి భర్త శాంతరాజు, డిప్యూటీ డిఎంహెచ్ ఓ మల్లేష్, వైద్యులు రాజేష్ కుమార్, శ్రీవాణి ,కావ్య మాధురి, ఓబులేష్, మాజీ కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోముల మహేశ్వర్ రెడ్డి, వైసీపీ నాయకులు సివి సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి ,బాల నరసింహారెడ్డి, జయ సుబ్బారెడ్డి, గంగులయ్య, రవి, వైద్య సిబ్బంది రాఘవయ్య, సుకన్య ,భాస్కర్, నారాయణరెడ్డి ,రమేష్, ప్రజలు పాల్గొన్నారు.

➡️