వివేకా హత్య కేసులో విచారిస్తున్న పోలీసులు

Dec 7,2024 12:12 #Kadapa district

ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన పీఏ వెంకట కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఈ కేసుకు సంబంధించి పదిమంది సాక్షులకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు పులివెందుల డిఎస్పి మురళి నాయక్ జారీ చేసిన విషయం తెలిసిందే. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ 15న మాజీమంత్రి వైయస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసినారు. ఈ కేసును తిరిగి విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పులివెందుల పోలీసులకు ఆదేశాలు రావడంతో ఈనెల 5వ తేదీ హాజరుకావాలని నోటీసుల లో తెలిపారు. కానీ వర్రా రవీంద్ర రెడ్డి కేసుకు సంబంధించి డీఎస్పీ మురళి నాయక్ బిజీగా ఉండడంతో విచారణ ఏడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది. శనివారం పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి వివేకా పిఎ వెంకట కృష్ణారెడ్డి తో లాయర్ ఓబుల్ రెడ్డి, భారత్ యాదవ్ , రఘునాథరెడ్డి , ఇ సీ సురేంద్ర నాథ్ రెడ్డి , మూలి రాజేష్ కుమార్ రెడ్డి లు విచారణకు హాజరయ్యారు. వీరిని డీఎస్పీ మురళి నాయక్ విచారణ చేస్తున్నారు. విచారణకు హాజరు కావడం మరియు విచారణ జరుగుతుండడంతో ఈ కేసు విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

➡️