ప్రజాశక్తి-కడప అర్బన్
సీజనల్ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరం కడప జోనల్ మలేరియా అధికారి డాక్టర్ కె.లక్ష్మీ నాయక్ అన్నారు. బుధవారం రాయలసీమలోని 8 జిల్లాలకు సంబంధించిన సబ్ యూనిట్ మలేరియా అధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కాన్ఫరెన్స్ హాల్‌లో సీజనల్ వ్యాధుల పైన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు సమావేశంలో ప్రసంగిస్తూ ప్రజల భాగస్వామ్యం సీజనల్ వ్యాధుల నివారణలో ఎంతైనా అవసరమని చెప్పారు. గ్రామాలలో హడావుడి పడకుండా మొక్కుబడిగా ఫ్రైడే కార్యక్రమాలను చేయరాదని పేర్కొన్నారు. . రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు రాయలసీమలోని ఎనిమిది జిల్లాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఒక ప్రణాళిక బద్దంగా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లడానికి శిక్షణ కార్యక్రమం సిబ్బంది ఏర్పాటు చేశామని తెలిపారు. కడప జోనల్ మలేరియా అధికారి డాక్టర్ కె లక్ష్మీనాయక్ మాట్లాడుతూ 8 జిల్లాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నూటికి నూరు శాతం వైద్య ఆరోగ్య సిబ్బంది ఫీల్డ్‌లో పర్యటించినప్పుడు దోమలను ఉత్పత్తి చేసే బ్లీడింగ్ స్థలాలను తప్పనిసరిగా గుర్తించాలన్నారు. దోమల నివారణ చర్యలకై ఎనిమిది జిల్లాలలో ముందు జాగ్రత్తగా మలేరియా వర్కర్ల చేత క్రిమిసంహారక మందులను గ్రామాలలో తప్పనిసరిగా స్ప్రేయింగ్ చేయించాలని పేర్కొన్నారు. మలేరియా వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను మలేరియా లైఫ్ సైకిల్ గూర్చి కడప జిల్లా మలేరియా అధికారి మనోరమ సమావేశంలో విపులంగా వివరించారు. కడప మైక్రో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగ సుధారాణి, కర్నూలు, చిత్తూరు జిల్లాల మలేరియా నివారణ అధికారులు ఏ నూకరాజు బి. వేణుగోపాల్ గ్రామాలలో వ్యక్తార్ కంట్రోల్ స్ప్రింగ్ టెక్నిక్స్ గురించి ఐఆర్‌ఎస్, ఇతర కెమికల్ మెథడ్స్ లో అవలంబించాల్సిన పద్ధతులను గురించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 110 మంది మలేరియా సబ్ యూనిట్ అధికారులు వెక్టార్ బార్న్ వ్యాధులలో దోమ ఉత్పత్తి చందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నివారణ చర్యలను గురించి చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు పార్వతీశం, అధికారులు పాల్గొన్నారు.
