రిటైర్మెంట్‌ వయసు పెంచాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌
కడప కార్పొ రేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఆప్కాస్‌ ఉద్యోగులను వయసు రీత్యా తొలగి స్తున్నారని, వీరి రిటైర్మెంట్‌ వయసు 62 సంవ త్సరాలకు పెంచాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు మనోహర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఇంజినీరింగ్‌ ఉద్యోగులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు పోరుబాట పట్టబోతున్నారని తెలిపారు. దీనికి కూటమి ప్రభుత్వమే కారణమని చెప్పారు. 40 సంవత్సరాల నుంచి పంచాయతీ, కార్పొరేషన్‌ వరకు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తన్నాయి, పోతున్నాయి కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ప్రభుత్వం అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఏ విధంగా తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టులు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మొన్న ఢిల్లీ కోర్ట్‌ కూడా పర్మినెంట్‌ వారితో సమానంగా అవుట్‌ స్టోర్సింగ్‌ వారికి సమానం గా వేతనాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వలకు మటుకు చీమ కుట్టిన్నట్టుగా లేదని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పర్మినెంట్‌ కార్మికుల తో పాటు రిటైర్మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కింద రూ.3 లక్షలు ఇవ్వాలని తెలిపారు. ఆరోగ్యం బాగా లేని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ అయిన వారి ని అడిసినల్‌ వర్కగా పోస్ట్‌ ఇవ్వాలని కోరారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. అనంతరం అడిసినల్‌ కమీషనర్‌ రాకేష్‌ చంద్రం కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన 60 నుంచి 62 వరకు ఉన్నవారిని తొలగించమని హామీ ఇచ్చారు. 62 సంవత్సరాల పై బడిన వారిని తొలగిస్తామని చెప్పారు. రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ అనేది మేయర్‌, ఎమ్మెల్యే, కమీషనర్‌ దష్టి కి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్‌, కోశాధికారి గోపి, సహాయ కార్యదర్శులు ఆనంద రావు, బ్రహ్మానంద రెడ్డి, పర్మినెంట్‌ నాయకులు కొండయ్య, నగర నాయకులు శ్యాం బాబు, అజాముద్దీన్‌ బాషా, రామసుబ్బారెడ్డి,లక్ష్మి రెడ్డి, హనుమంత్‌ రెడ్డి, హరినాయక్‌, రాయుడు, సోమిరెడ్డి, లక్షుమయ్య, ప్రసన్న కుమార్‌, గంగాధర్‌, రామ మోహన్‌ రెడ్డి, రామ్‌ చెన్నయ్య, శరత్‌, ఆంజనేయులు, ఆరిఫ్‌, కార్మికులు పాల్గొన్నారు.

➡️