సిసి రోడ్డు పనులు అడ్డుకున్న మహిళలు

ప్రజాశక్తి-కలసపాడు
పేదల స్థలాల్లో చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను మహిళలు అడ్డు కున్నారు. అవసరం లేని చోట రోడ్డు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అధి కారులు వెనక్కి తగ్గారు. వివ రాలు.. మండలంలోని పుల్లా రడ్డిపల్లె ఎస్‌సి కాలనీలో సుమారు 400 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సర్ప ంచ్‌గా ఓబులమ్మ ఎన్నికయ్యారు. గత ప్రభుతంలో సచివాలయం, ఆర్‌బికె, సిసి రోడ్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. కొద్ది రోజుల నుంచి సచివాలయానికి రహదారి కావాలని కొందరు సచివాలయ ఉద్యోగుల విన్నపం మేరకు సంబంధి తాధికారులు సిసి రోడ్డును మంజూరు చేశారు. పేదల స్థలాలు పూర్తి తొలగించి రోడ్డు వేయడానికి అధికారులు చర్యలు తీసుకోవడంతో కాలనీ వాసులు ఆగ్రహి ంచారు. మంగళవారం జెసిబితో చేపడుతున్న సిసి రోడ్డు పనులను సర్పంచ్‌, బంధు వులు, మహిళలు అడ్డుకున్నారు. అనంతరం ఎంపిడిఒకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరం లేని చోట రోడ్లు వేయడం ఏమిటని, అందులో తమ స్థలాలు మీదుగా వేయడం సరైంది కాదని, కుల వివక్షత చూపే అధికారుల కోసం తమ సచివాలయంలో అవసరం లేదన్నారు. తాము సచివాలయానికి వెళ్తే అధికారులు వివక్షతో చూస్తారని పేర్కొన్నారు. పేదల ఇళ్ల స్థలాల జోలికి వస్తే ఉద్యమిస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు.

➡️