ప్రజాశక్తి – కడప అర్బన్
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 37వ క్రీడా మహోత్సవాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఆర్. మాధవి రెడ్డి అధ్యక్షులుగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాసులు రెడ్డి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ముఖ్యంగ,ా బాలికలు అన్ని రంగాలలో అభివద్ధి సాధించినప్పుడే జీవిత లక్ష్యాన్ని చేరుకోగలరని అన్నారు. చదువుతో పాటు ఆటల పోటీల్లో తరచూ పాల్గొని, శారీర దారుఢ్యాన్ని పెంచు కోవాలన్నారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ 37 సంవత్సరాలుగా క్రీడోత్స వాలు నిర్వహించడం, క్రీడలపై ప్రత్యేక శ్రద్ధను చూపించడం అభినందనీయం అన్నారు. అనంతరం ఆట పోటీలను ముఖ్య అతిథి సవితా ప్రారంభించారు. పాఠాశాల డైరెక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా క్రీడలలో తమ విద్యార్థులు సాధించిన పతకాల గురించి తెలి యజేశారు. కార్యక్రమంలో డిఇఒ షంషుద్దీన్, ప్రిన్సిపల్ హరికష్ణ, ఇన్‌ఛార్జి సంధ్య, ఓబుల్ రెడ్డి , జయచంద్ర, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.
