12వ పిఆర్‌సి కమిటీ నియమించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌
12వ పిఆర్‌సి కమిటీ నియమించాలని, ఆర్థిక బకాయి చెల్లింపులకు రోడ్డు మ్యాప్‌ ప్రకటించాలని ఎపి జెఎసి సెక్రటరీ జనరల్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. ఎస్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 నాటికి పిఆర్‌సి గడువు ముగిసినా గత ప్రభుత్వం కమిటీ నియామకం చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల 12వ పిఆర్‌సి కమిటీ పని ప్రారంభం కాలేదని తెలి పారు. గత ప్రభుత్వం నియామక చేపట్టిన చైర్మన్‌ తన పదవికి రాజీనామా చేశారుని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా పిఆర్‌సి కమిటీ నియమించకపోవడం శోచనీ యమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఆగిపోయిన రూ.25వేల కోట్ల బకా యిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 11వ ఆర్‌సి అరియర్స్‌ డిఎ అరియర్స్‌, 2022 నుంచి ఇప్పటివరకు ఇఎల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ ఇప్పటివరకు చెల్లించ లేదన్నారు. 2003 డిఎస్‌సిలో నియామకమైన ఉపాధ్యాయులకు సిపిఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంటిఎస్‌ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలన్నారు. వారికి ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాల పెంచాలని చెప్పారు. సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మహేష్‌ బాబు, జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్‌, ట్రెజరర్‌ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శి అజాజ్‌ అహ్మద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ డి.కష్ణారెడ్డి, నాయకులు కరీముల్లా, గోపీనాథ్‌, ప్రభాకర్‌, మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.

➡️