టోకెన్ల జారీలో ఘటన తీవ్ర విచారకరం 

Jan 9,2025 12:49 #Kadapa

– తిరుమల చరిత్రలో ఇంతటి అపచారం ఎప్పుడు జరగలేదు
– పాలకమండలి చేతగాని నిర్ణయాల వల్ల ఈ దారుణం జరిగింది
– మృతి చెందిన వారికి 1 కోటి రూపాయలు, గాయపడిన వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
–   మాజీ టీటీడీ సభ్యులు మాసీమ బాబు, యానదయ్య 
ప్రజాశక్తి – కడప :  వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ లో భక్తుల మృతి తీవ్ర విచారకరం అని మాజీ టీటీడీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య పేర్కొన్నారు. 6 మంది మృతి, వందల మంది గాయాలు పాలవ్వడం బాధాకరం అన్నారు. తిరుమల చరిత్రలో ఇంతటి అపచారం ఎప్పుడు జరగలేదని అన్నారు. పాలక మండలి చేతగాని నిర్ణయాల వల్లే ఈ దారుణం జరిగిందని అన్నారు. మృతి చెందిన వారికి  1 కోటి రూపాయలు, గాయపడిన వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం వైసీపీ కడప జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.వేలాది మందిని బాధ్యతా రహితంగా అధికారులు ఒక్కసారిగా క్యూ లైన్ లోకి వదలడం ఏంటి? అని ప్రశ్నించారు.తిరుమల చరిత్రలో ఇంతటి అపచారం ఎప్పుడు జరగలేదు అన్నారు.దీనికి కారణమైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బాధ్యత వహించాలి అన్నారు.ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలు బాధాకరం అని పేర్కొన్నారు.ఘటన ముందే జరుగుతుంది అని తెలుసు అని చెప్పడం, అయినా ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అని అన్నారు. వెంకయ్య చౌదరి నీ సస్పెండ్ చేయాలి అన్నారు.సర్వదర్శనం నిలిపివేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు.తిరుమలను కూటమి ప్రభుత్వం అపవిత్రం చేస్తున్నారు అని తెలిపారు.పాలక మండలి చేతకాని నిర్ణయాల వల్ల ఈ దారుణం అన్నారు.తిరుమల లడ్డు పై అనవసర వివాదం బయటకు తెచ్చారు.పాలకమండలి మొత్తం రాజకీయ వ్యక్తిగత స్వార్థం కోసం ఉన్నారు అని తెలిపారు.సామాన్య భక్తులకు అందాల్సిన దర్శనం, ఏర్పాట్లపై పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు.గతంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు  షూట్ పేరుతో అనేక మంది మృతికి కారణం అయ్యాడు అన్నారు.టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆ స్థానానికి అనర్హుడు అని అన్నారు. విలేకరుల సమావేశంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️