మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Nov 28,2024 13:09 #Kadapa district

ఎమ్మెల్యే, విప్ మాధవికి వినతిపత్రం
ప్రజాశక్తి-కడప అర్బన్ : మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) జిల్లా కోశాధికారి గోపి కోరారు. గురువారం ఎమ్మెల్యే, విప్ మాధవికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు గత ప్రభుత్వంలో విభజించు పాలించు అన్న విధంగా 2023, డిసెంబర్ 24వ తేదీ నుంచి 16 రోజులు సమ్మె చేస్తే పారిశుధ్య కార్మికులకు పెంచి ఇంజినీరింగ్ కార్మికులకు పెంచకుండా అన్యాయం చేసిందని తెలిపారు. సమ్మె కాలం లో టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసల రెడ్డి మాకూ మద్దతుగా వచ్చారని చెప్పారు. అదే విధంగా ఇంజినీరింగ్ విభాగంలో వున్నా వారికీ క్యాడర్ ఆప్కాస్ లో మారడం లేదని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల కు ఇస్తున్నా జీవో ను ఇంజినీరింగ్ కార్మికుల కు కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.విజయభాస్కర్, సహాయ కార్యదర్శి ఎం.ఆనందరవు, కె.సుబ్బయ్య. కె.ఆంజనేయులు, శ్యాంబాబు, ఎం.నారాయణ. ఎం. సుబ్బారాయుడు, గురువయ్య, చెండ్రాయుడు, బాల గంగయ్య పాల్గొన్నారు.

➡️