జాతీయ నాయకుల స్ఫూర్తిని కొనసాగించాలి

Jan 26,2025 13:08 #Kadapa district

విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
ప్రజాశక్తి – చాపాడు (మైదుకూరు) : జాతీయ నాయకుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనసాగించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఆదివారం మైదుకూరు రాయల్ కూడలిలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నూరు అడుగుల జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో పలుచోట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అమరజీవి పొట్టి శ్రీరాములు, యోగివేమన కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో జాతీయ నాయకులు కష్టపడి మన దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధించారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో కృషిచేసి రాజ్యాంగాన్ని రచించారన్నారు. వీరందరి కృషి ఫలితంగా నేడు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ వీరు స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. మైదుకూరులో నూరు అడుగుల ఎత్తులో జెండాను ఆవిష్కరించడం, జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి, ఎంపిడిఓ శ్రీధర్ నాయుడు, తహశీల్దార్ రాజ సింహ నరేంద్ర, టిడిపి నాయకులు ధనపాల జగన్, దాసరి బాబు, ఏపీ రవీంద్ర, యాపరాల చిన్న, ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి ప్రసాద్ గుప్తా, ఆర్యవైశ్య ప్రముఖులు, మాల మహానాడు నాయకులు వెంకటసుబ్బయ్య, వసంత్ కుమార్, నాయకులు అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️