ఘోర రోడ్డు ప్రమాదం

ప్రజాశక్తి-ఒంటిమిట్ట
మండలం పరిధిలోని నడింపల్లి వద్ద కడప -చెన్నై ప్రధాన రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూడు వాహనాలు ఢకొీన్న సంఘటనలో ముగ్గురు అక్కడిక క్కడే మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన వారిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు. నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ధర్మారెడ్డి(30), వినోద్‌ (35) మరో వ్యక్తి ముగ్గురు స్కార్పియోలో తిరుపతి నుంచి నంద్యాలకు పయనమయ్యారు. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి ఎలక్ట్రిక్‌ బస్సును వేగంగా ఢకొీన్నారు. ఈ సంఘటనలో స్కార్పియో వాహనంలోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం నుజ్జునుజ్జు అయింది. అదే సమయంలో బస్సు వెనుక వైపు వస్తున్న పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం బస్సును తప్పించబోయి రోడ్డుపక్కనున్న చెట్టును ఢకొీంది. వాహనంలో డ్రైవర్‌తోపాటు కానిస్టేబుల్‌ రఘునాధరెడ్డికి గాయాలయ్యాయి. 108 వాహనంలో వారిద్దరిని చికిత్ప నిమిత్తం కడప రిమ్స్‌కు తరలి ంచారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌ తరలించారు. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట సిఐ బాబు, ఎస్‌ఐ శివప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్కార్పియో వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి : మంత్రి నడింపల్లి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

➡️