మహిళల్లో శాస్త్రీయ దక్పథం పెంపొందాలి

ప్రజాశక్తి కడప అర్బన్‌
మహిళల్లో శాస్త్రీయ దక్పథం పెంపొందాలని ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ కల్పన పేర్కొన్నారు. సోమవారం యుటిఎఫ్‌ కార్యాలయంలో మార్పు కోసం మహిళ కమిటీ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం లోని 51ఎ (హెచ్‌) ప్రకారం ప్రతి ఒకరు శాస్త్రీయ దక్పథం కలిగి ఉండాలని తెలిపారు. ఫలితంగా కుటుం బమంతా శాస్త్రీయ దక్పథంతో ఉంటుందని చెప్పారు. దీనివల్ల అన్ని రంగాల్లో దేశం అభివద్ధి చెందుతుందన్నారు. స్టెప్‌ సిఇఒ సాయి గ్రేస్‌ మాట్లాడుతూ మహిళా సాధికారత కలిగి ఉండడం వల్ల ఆర్థికంగా సమాజం అభివద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకోవడం ద్వారా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. మహిళా సదస్సు నిర్వహి ంచడం అభినందనీయమని చెప్పారు. న్యాయవాది ఉదయశ్రీ మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. శ్రామిక మహిళలు ఎదుర్కొనే సమస్యల పైన చట్టాల ద్వారా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు వివరించారు. మహిళలకు రాజ్యాంగం పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించిందని తెలిపారు. కొన్ని రంగాల్లో చోటుచేసుకుంటున్న వివక్షతను చట్టాల ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మహిళలకు ఉండే హక్కులు చట్టాలు, చట్టాలు తెలుసుకుని పరిష్కరించేందుకు వాడుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సుకు అధ్యక్షత వహించిన జన విజ్ఞాన వేదిక నాయకురాలు అరుణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన జన విజ్ఞాన వేదిక, యుటిఎఫ్‌, శ్రామిక మహిళ, ఐద్వా నాయకులను అభినందించారు. ఉపన్యాసకులకు జన విజ్ఞాన వేదిక వేమన పుస్తకాలను బహుక రించింది. సదస్సుకు ముందు ఎక్కడమ్మా… గీతానికి విద్యానికేతన్‌ స్కూల్‌ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్ర మంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు లక్ష్మీదేవి, యుటిఎఫ్‌ నాయకులు సుజాత రాణి, రూత్‌ ఆరోగ్య మేరీ, జెవివి నాయకులు సరస్వతి, మౌనిక, ఐద్వా నాయకులు ఐ.ఎన్‌.సుబ్బమ్మ, జమీల, ఎపి జీబీ నాయకులు శ్యామల, మహిళలు పాల్గొన్నారు.

➡️