ట్రిపుల్ ఐటీ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్తా

Dec 11,2024 12:43 #Kadapa district

ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి

ప్రజాశక్తి – వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లెలోని టిడిపి నేత వేమిరెడ్డి కృష్ణారెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విచ్చేశారు. ఇటీవల వేమిరెడ్డి కృష్ణారెడ్డి తండ్రి మల్లారెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లారెడ్డి కుటుంబానికి అన్ని పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని ఓల్డ్ క్యాంపస్ ఉన్న విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయినట్లు విషయం తెలిసిందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ అధికారులు కూడ ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. వేంపల్లెలోని బాలికల పాఠశాలలో కూడ ఉపాధ్యాయులు ఉండి విద్యార్థులకు చదువు చెప్పక పోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీ సమస్యలపై విద్యా శాఖ మంత్రి దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని మరో సారి కూడ మళ్లీ తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు. ఈయన వెంట మాజీ ఎంపిటిసి జివి రమణ, డివి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు టిడిపి నేతలు పాల్గొన్నారు.

➡️