రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఘనస్వాగతం  

Dec 7,2024 11:55 #Kadapa district

ప్రజాశక్తి – కడప : జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం  రోజు కడపలోని మున్సిపల్ కార్పోరేషన్ హై స్కూల్ (మెయిన్) నందు మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్  కార్యక్రమాలలో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి కడప విమానాశ్రయం కు ఉదయం 11.00 గంటలకు  చేరుకున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.  కడప విమానాశ్రయంలో  జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, పీఆర్ కమిషనర్ కృష్ణ తేజ,  ఇంఛార్జి ఎస్పీ విద్యాసాగర్, పి ఎస్ టు డిప్యూటి సి యం మధుసూదన్,  కడప ఆర్డీ ఓ జాన్ ఇర్వీన్, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, ఎమ్మెల్సీ వైస్ ఛైర్మన్ జకీయా ఖానం, సికే దీన్నే తహసీల్దార్ నాగేశ్వరరావు ఇతర  అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా అందరిని పలకరించి మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్   కార్యక్రమాలలో పాల్గొనేందుకు మున్సిపల్ కార్పోరేషన్ హై స్కూల్ (మెయిన్)కు ఉదయం 11.06 గంటలకు రోడ్డు మార్గాన  బయలుదేరి వెళ్లారు.

➡️