పింఛన్‌ కోసం వచ్చి గుండెపోటుతో మహిళ మృతి

ప్రజాశక్తి – వేంపల్లె
కడప జిల్లా వేంపల్లె మండ లంలోని పాములూరు గ్రామ సచివాలయ వద్ద ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సామాజిక పింఛను తీసుకున్న కొద్ది నిమిషాలోనే మహిళ గుండె పోటుతో మృతి చెందారు. మండల ంలోని అమ్మగారిపల్లె గ్రామా నికి చెందిన భోగపతి రాజ్యలక్ష్మి (49) అనే మహిళ వేం పల్లెలోని రాజీవ్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది. భోగపతి రాజ్యలక్ష్మి భర్త చనిపో వడంతో వితంతు కింద ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. ప్రతి నెల పాములూరు గ్రామంలోని సచివాలయం వద్దకు వెళ్లి రాజ్యలక్ష్మి పింఛను తీసుకొనేదని మృతురాలి బంధువులు తెలిపారు. మంగళవారం 1వ తేదీ కావడంతో మృతురాలు రాజ్య లక్ష్మి పాములూరులోని గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి పింఛను తీసుకొని సచివాలయ వెలుపలికి వచ్చి మోటర్‌ బైకు ఎక్కుతుండగా ఒక్క సారిగా కింద పడిపోయి అక్కడక్కడే రాజ్యలక్ష్మి మహిళ మృతి చెందారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో మృతురాలిని బంధువులు వేంపల్లెలోని రాజీవ్‌ నగర్‌ కాలనీకి తీసుకొని వెళ్లారు. గ్రామ సచివాలయం వద్ద పింఛను తీసుకొని మహిళ మృతి చెందడంతో గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది దిగ్రాÄ్భంతికి లోనయ్యారు.

➡️