త్రిబుల్‌ ఐటీకి కడియం హైస్కూల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : కడియం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ లో చదివి, 2023 – 2024 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు త్రిబుల్‌ ఐటీలో స్థానం దక్కిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.సత్యనారాయణ తెలియజేశారు. పదో తరగతిలో 576 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానం పొందిన తాండ్ర హేమ, 556 మార్కులు సాధించిన జక్కల భాను ప్రకాష్‌ లు శ్రీకాకుళం త్రిబుల్‌ ఐటీ లో సీట్లు సాధించారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బఅందం గొల్లపల్లి సత్యనారాయణ, ఎస్‌. శ్రీనివాస్‌, రఫీయుద్దీన్‌, శరత్‌, అక్షయ, సువర్ణవేణిలు ఇరువురు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యపరంగా భవిష్యత్‌ లో ఎలాంటి అవసరం ఉన్నా తాము అండగా ఉంటామని విద్యార్థులకు భరోసానిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

➡️