పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకం కైవసం చేసుకున్న కాకినాడ ఆర్టీసీ డ్రైవర్

Nov 26,2024 18:24 #Kakinada, #Power lifting

 

ప్రజాశక్తి – కాకినాడ : జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో కాకినాడ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఎమ్. శ్రీనివాసరావు బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పంజాబ్ ఖరార్ లో జరిగిన రైతు బారా యూనివర్సిటీ నిర్వహించిన ఆలిండియా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో 550 మంది పవర్ లిఫ్టర్స్ పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో కాకినాడ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న క్రీడాకారులు ఎం.శ్రీనివాసరావు 450 కేజీల విభాగంలో బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మొత్తం 77 పతకాలు సాధించిన శ్రీనివాసరావును పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తెచ్చే వ్యక్తిగా ఎదగాలని కోరుతున్నారు. జనవరిలో బెంగుళూరులో జరగబోయే ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఆ పోటీలకు ఆర్టీసీ మేనేజ్మెంట్ వారు డిపార్ట్మెంట్ తరఫున పంపించాలని శ్రీనివాసరావు కోరుతున్నారు.

➡️