అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

Feb 12,2024 23:27
స్పందన కార్యక్రమంలో అందిన

ప్రజాశక్తి – కాకినాడ

స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారిం చాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరే ట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్‌ వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనకు 403 అర్జీలు వచ్చాయని, వాటిని సత్వరం పరిష్కారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం అని అన్నారు. స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని సంబందిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలన్నారు. రీ ఓపెన్‌ అయ్యే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి శాస్వత పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అర్జీలను సత్వరం పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ప్రవీణ్‌ ఆదిత్య, జడ్‌పి సిఇఒ ఎం.శ్రీరామచంద్రమూర్తి, డిఆర్‌డిఎ పిడి కె.శ్రీరమణి, సిపిఒ పి.త్రినాథ్‌, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️