ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి బాధ్యతల స్వీకరణ

Feb 12,2024 23:29
జిల్లా స్పెషల్‌

ప్రజాశక్తి – కాకినాడ

జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్‌పిగా సోమవారం కె.శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆమె చిత్తూరు జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఇబి) అదనపు ఎస్‌పిగా పనిచేస్తూ సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ ఎస్‌ఇబి అదనపు ఎస్‌పిగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కె.శ్రీలక్ష్మి సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

➡️