ఘనంగా ఈస్టర్‌ ఆరాధనలు

Mar 31,2024 21:32
యేసుక్రీస్తు పునరుద్దాన పండుగ (ఈస్టర్‌) ప్రార్థనలు

ప్రజాశక్తి – సామర్లకోట, పెద్దాపురం

యేసుక్రీస్తు పునరుద్దాన పండుగ (ఈస్టర్‌) ప్రార్థనలు ఆదివారం ఘనంగా జరిగాయి. క్రైస్తవులు వారి కుటుంబీకులు ఆదివారం తెల్లవారు జామునే వారి బంధువుల సమాదుల వద్దకు చేరుకుని కొవ్వొత్తులు, పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కల్వరి సెమిస్ట్రీ కమిటీ చైర్మన్‌ ఊబా జాన్‌ మోసెస్‌, బిఎస్‌ వందనం ఆధ్వర్యంలో సమాదుల తోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక పిఠాపురం రోడ్డులోని సమాదుల తోటలో మున్సిపల్‌ కో అప్సన్‌ సభ్యులు కళ్యాణ్‌ ఆధ్వర్యంలో చేసిన ప్రార్థనల్లో వైసిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వైసిపి నాయకులు దవులూరి సుబ్బారావు, మున్సిపల్‌ కౌన్సిలర్లు కుసుమ చంటిబాబు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురం పట్టణ, మండల పరిధిలో పలు గ్రామాల్లో ఆదివారం ఈస్టర్‌ ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని తిరుపతి, చదలాడ, దివిలి, కాండ్రకోట గ్రామాల్లోని క్రీస్తు శాంతి ప్రార్థనా మందిరాల్లో ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంగిన సత్యానందం, నంగిన సామ్యూల్‌సుదీప్‌, అభిషేక్‌, శాంత కుమారి, ప్రేమలత, రాయవరపు వీరబాబు, సత్య, పరంజ్యోతి పాల్గొన్నారు.

➡️