చరిత్రలో నిలిచిన అంగన్‌వాడీల పోరాటం

Feb 10,2024 22:31
చరిత్రలో నిలిచిన అంగన్‌వాడీల పోరాటం

ప్రజాశక్తి-కాకినాడఅంగన్వాడీలు చేసిన 42 రోజుల పోరాటం ఆంధ్రప్రదేశ్‌ కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి కొనియాడారు. కాకినాడ ధర్నాచౌక్‌లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి అభినందనసభ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అధ్యక్షతన నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ఎపి అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి మాట్లాడారు. అంగన్వాడీ సంఘం రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన 12 డిమాండ్లలో 11 డిమాండ్లు సాధించామని, ఒక్క రూపాయి నష్టపోకుండా సమ్మె కాలపు వేతనాలు చెల్లించేలాగా, ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించకుండా అంగన్వాడీ ద్యమం ఘనవిజయం సాధించిందని తెలిపారు. ఈ అభినందన సభలో కాకినాడ జిల్లా అంగన్వాడి సంఘం నాయకులు దాడి బేబీ, ఎస్తేర్‌ రాణి, రాజేశ్వరి, వీరవేణి, నాగమణి, జిల్లా కోశాధికారి రమణమ్మ, నగర కార్యదర్శి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బాలం లక్ష్మి, వరలక్ష్మి, చామంతి పాల్గొన్నారు.

➡️