జోరుగా ఎన్నికల ప్రచారాలు

Mar 31,2024 21:26
జనసేన పార్టీల

ప్రజాశక్తి – యంత్రాంగం

జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో వైసిపి, టిడిపి, జనసేన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మ రంగా సాగించారు. సామర్లకోట స్థానిక ఎంప్లాయిస్‌ కాలనీలో కోటిపల్లి శ్రీను ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరారు. వీరికి ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తుమ్మల బాబు, టిడిపి నాయకులు నిమ్మకాయల రంగనాగ్‌, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, కంటే బాబు, బలుసు వాసు, అందుగుల జార్జి చక్రవర్తి పాల్గొన్నారు. కాజులూరు మండలంలోని దుగ్గుదుర్రు గ్రామంలో సర్పంచ్‌ పోతు వెంకటలక్ష్మి పరమేశ్వరరావు, రంపాల రాజు ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరారు. వీరికి టిడిపి రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పెద్దిరెడ్డి చంద్రరావు, ఆంజనేయ వరప్రసాద్‌, టిడిపి నాయకులు కోప్పిశెట్టి స్వామినాయుడు, యాళ్ల కృష్ణారావు, కొల్లు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి మండలంలోని సూరంపాలెం గ్రామంలో టిడిపి జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, కుంచే రాజా, పో సిన బాబురావు, సూరంపాలెం బాలు, కుంచె రామకృష్ణ పాల్గొన్నారు. ఏలేశ్వరం మండలంలోని సిరిపురం గ్రామంలో జయహో బిసి సదస్సు జరిగింది. ఈ సదస్సులో టిడిపి ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సత్య ప్రభ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️