తుని టిడిపిలో గ్రూపుల పోరు

Apr 2,2024 22:42
టిడిపిలో గ్రూపుల పోరు

ప్రజాశక్తి – కోటనందూరు

తుని నియోజకవర్గంలో టిడిపిలో గ్రూపుల పోరు కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ప్రకటన సమ యంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకీ, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు మధ్య వర్గ విభే దాలు తారా స్థాయికి చేరాయి. గత రెండు ఎన్నికల్లో యనమల కృష్ణుడు పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈ దఫా ఎన్నికల్లో తన పెద్ద కుమార్తె యనమల దివ్యను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమిం చడంతో అలకబూనిన యనమల కృష్ణుడు అన్నపై తిరుగు బావుటాను ఎగురవేశారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన విబేధాలను సర్దుబాటు చేసేందుకు టిడిపి అధిష్టానం ప్రయత్నించింది. వివిధ దశల్లో చేసిన చర్చలతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలోనే టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా యనమల దివ్యను టిడిపి అధిష్టానం ప్రకటించింది. టిడిపికి నియోజకవర్గంలో గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు తన పెద్ద కుమార్తె యనమల దివ్యను గెలిపించేందుకు యనమల రామకృష్ణుడు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీకి దూరమైన వారిని గుర్తించి తిరిగి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోటనందూరు, తుని, తొండంగి మండలాలకు చెందిన వైసిపికి చెందిన పలువురు నాయకులను టిడిపిలో చేర్చుకున్నారు. మరింతమందిని పార్టీలోకి తెచ్చేందుకు యనమల రామకృష్ణుడు ప్రత్యేక దృష్టి సారించారు. వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనతో కొందరు నాయకులు కినుక వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యనమల కృష్ణుడు, పోలనాటి శేషగిరి గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారానికి దూరం అయ్యారు. అలాగే తుని పట్టణ టిడిపి సీనియర్‌ నాయ కులు, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు దిబ్బ శ్రీను, బిసి సెల్‌ సెక్రెటరీ సిల్పర్శెట్టి జగన్మోహన్‌ టిడిపికి రాజీనామాలు చేసి వైసిపిలో చేరి పోయారు. అలాగే టిడిపి కోటనందూరు మండల కార్యదర్శి లెక్క ల భాస్కర్‌ సైతం టిడిపికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో టిడిపిలో గ్రూపుల పోరు కొనసాగుతుందనే భావన శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. ఇంత జరుగుతున్నా యనమల కృష్ణుడు గ్రూపు మౌనంగా ఉండిపోవడం వంటి పరిణామాలు రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తాయో అన్న సందిగ్ధతి వ్యక్తం అవుతోంది.

➡️