నిరుపయోగంగా ట్రాన్స్‌ఫార్మర్లు..

Mar 3,2024 23:21
సామర్లకోట పట్టణంలో

ప్రజాశక్తి – సామర్లకోట

సామర్లకోట పట్టణంలో పాడైన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఎవరికి పట్టనట్టుగా సామర్లకోట పిఠాపురం రోడ్డులో అపార్ట్మెంట్ల సమీ పంలో రోడ్డు పక్కన పడి ఉన్నాయి. పట్టణంలో అనేక ప్రాంతాల్లో విద్యు త్‌లో వోల్టేజ్‌ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా చిన్న పాటి రిపేర్లకు గురైన విలువైన ట్రాన్స్‌ఫార్మార్‌లు అధికారుల నిర్లక్ష్యా నికి గురవు తున్నాయి. స్థానిక పిఠాపురం రోడ్డులోని టిడ్‌ కో గృహ సముదాయాల వద్ద ఈ ట్రాన్స్‌ ఫార్మార్‌లను ట్రాన్స్‌కో అధికారులు ఉంచారు. లో వోల్టేజి సమస్య రాగానే వాటిని తొలగించి ఇలా ప్రక్కన పడేస్తున్నారు. దానితో లక్షలాది రూపాయలు విలువజేసే పరికరాలు తుప్పు పడుతున్నాయి. కొంతకాలం వాటిని అలానే వదిలిపెడితే దానిలోని కాపర్‌ చోరీకి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏళ్ళ తరబడి లబ్ధిదారులకు టిడ్‌ కో గృహాలు అప్పగించని కారణంగా గృహాల్లో ఉన్న విద్యుత్‌ సంబంధిత సామాగ్రీ చోరుల పాలు అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో కారణం లేకుండా ఆ ప్రాంతంలో ఉంచిన ట్రాన్స్‌ఫార్మార్లు సైతం కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కొద్దిపాటి లోపాలున్న ట్రాన్స్‌ఫార్మార్‌లకు రిపర్లు చేపట్టివినియోగంలోకి తీసుకువచ్చి లోవోల్టేజి ఉంటున్న ప్రాంతాల్లో, విద్యుత్‌ సరఫరా లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని, తద్వారా ట్రాన్స్‌ఫార్మార్‌లలో కాపర్‌ చోరీలను ఆపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

➡️