పోలియో రహిత సమాజమే లక్ష్యం

Mar 3,2024 23:19
పోలియో రహిత సమాజమే లక్ష్యమని పలువురు

ప్రజాశక్తి – యంత్రాంగం

పోలియో రహిత సమాజమే లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 1320 సెంటర్లలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ స్థానిక గాంధీనగర్‌లోని ప్రతాప్‌ నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.వెంకటరావు, డిఎం అండ్‌ హెచ్‌ఒ నరసింహనాయక్‌ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. కాకినాడ నగరంలో దాదాపు 170 కేంద్రాలలో పోలియో చుక్కలను వేయిస్తున్నామన్నారు. మరో 20 బందాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ వంటి వంటి జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేస్తున్నాయన్నారు. మరో ఐదు మొబైల్‌ టీమ్‌ లు కూడా పనిచేస్తున్నాయని కమిషనర్‌ చెప్పారు. డిఎంఅండ్‌హెచ్‌ఒ నరసింహ నాయక్‌ మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద 1320 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. ఈ నెల 4, 5 తేదీలలో ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి మిగిలిపోయిన వారికి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీ చరణ్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ రత్న కుమార్‌, డాక్టర్‌ సురేఖచౌదరి, డాక్టర్‌ అజీజ్‌ పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పటవల ఉప ఆరోగ్య కేంద్రం వద్ద పిహెచ్‌సి ఛైర్మన్‌, ఎంపిపి రాయుడు సునీత ప్రారం భించారు. మండలంలో 46 సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రాయుడు గంగాధర్‌, హెల్త్‌ విజిటర్‌ నెహ్రూ రాణి, హెల్త్‌ అసిస్టెంట్‌ ఆంజనేయులు, ఎఎన్‌ఎంలు ఇందిర, స్రవంతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఏలేశ్వరం స్థానికంగా జరిగిన పోలియో చుక్కల పంపిణీ కార్య క్రమాన్ని మండలంలోని లింగంపర్తిలో నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ వరుపుల సుబ్బారావు ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పర్వత రాజబాబు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. జగ్గంపేట మండలంలోని ఇర్రిపాకలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రాజపూడి, కాట్రావులపల్లి గ్రామాల్లో 90 శాతానికిపైగా పోలియో చుక్కల కార్య క్రమం పూర్తియిందని వైద్యాధికారి రాజశేఖర్‌ తెలి పారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉప సర్పంచ్‌ బండారు రాజా, ఆర్య వైశ్య సేవ సంఘం అధ్యక్షులు కొత్త కొండ బాబులు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని, మల్లి శాల గ్రామంలో ఎంపిపి నాగబాబు ప్రారంభిం చారు. సామర్లకోట పట్ట ణంలో పలు వార్డుల్లో చేప ట్టిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎం ఎల్‌ఎ నిమ్మకాయల చిన రాజప్ప, ఆర్‌డిఒ జె.సీతా రామారావు, కమిషనర్‌ జె.రామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న తనంలోనే 0-5 లోపు వయసు గల పిల్లలకు క్రమం తప్పకుండా తల్లి దండ్రులు పోలియో చుక్కలను వేయించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్‌ శానిటర్‌ ఇన్‌స్పెక్టర్‌ పిచ్చుక శ్రీనివాసరావు, ఎఎస్‌ఒ పెంకే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొ న్నారు. పెద్దాపురం మండలంలోని పలు గ్రామాల్లో పల్‌ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చిన్న రాజప్ప, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ చైర్మన్‌లు నెక్కంటి సాయి ప్రసాద్‌, కనకాల మహాలక్ష్మి, వడ్లమూరు గ్రామంలో కంటే వీర రాఘవరావు, కాండ్ర కోటలో జడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, రాయభూపాల పట్నంలో ఎంపిపి పెంకే సత్యవతి తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి మండలంలో పల్స్‌ పోలియో 98 శాతం పూర్తయిందని వైద్యాధికారి సురేంద్ర తెలిపారు. పల్స్‌ పోలియో బూత్‌లను ఎంపిపి చలగళ్ళ దొరబాబు, జడ్‌పిటిసి పరిమి వెంకటలక్ష్మీ మంగతాయారు, మద్దిపట్ల రామకృష్ణ, గ్రామ సర్పంచ్‌ రుత్తల లలిత, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ పి.సరిత, స్థానిక వైద్యాధికారి బి సురేంద్రలు సందర్శించారు. అలాగే పలు గ్రామాల్లో చేపట్టిన పల్స్‌పోలియో కార్యక్రమాలను సర్పంచులు ప్రారంభించారు. మండలంలో 3338 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్‌ సురేంద్ర తెలిపారు. కరప మండలంలోని కరప, వేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 48 బూతుల్లో 95 శాతం పల్స్‌ పోలియో కార్యక్రమం పూర్తియిందని వైద్యాధికారులు డాక్టర్‌ శ్రీనివాస్‌నాయక్‌, డాక్టర్‌ సౌజన్య తెలిపారు. కరప పిహెచ్‌సిల పరిధిలో 3992 మంది పిల్లలు, వేలంగి పిహెచ్‌సి పరిధిలో 2796 మంది పిల్లలు ఉన్నారని, వీరిలో 95 శాతం పిల్లలకు పోలియో చుక్కలను వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మార్కెట్‌ సెంటర్‌లో మాజీ ఎంఎల్‌ఎ వరుపుల సుబ్బారావు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

➡️