పోస్టల్‌, హోమ్‌ ఓటింగ్‌పై ప్రణాళిక సిద్ధం

Apr 1,2024 23:26
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో

ప్రజాశక్తి – కాకినాడ

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది, వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఒటింగ్‌ను సక్రమంగా నిర్వహిం చేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా విజయవాడ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌, పోలింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న పిఒలు, ఎపిఒలు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, ఫెసిలిటీ సెంటర్స్‌, జిల్లాలో ఎన్నికల సక్రమ నిర్వహణకు అవ సరమైన సన్నద్ధత ఇతర ఎన్నికల అంశాలపై మాట్లా డారు. సాధారణ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన విడు దలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కమిషన్‌ సూచిం చిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌ను సక్రమంగా నిర్వ హించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పే నాయక్‌, డిపిఒ కె.భారతి సౌజన్య, సైనిక వెల్ఫేర్‌ అధికారి ఎం.కృష్ణారావు, డిఎల్‌డిఒ పి.నారాయణ మూర్తి, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️