మార్చి 1న చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి

Feb 26,2024 23:02
భవన నిర్మాణ కార్మికుల

ప్రజాశక్తి – కరప

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 1న జరిగే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ఎపి బిల్లింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు చెక్కల రాజ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గణేష్‌ భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యాలయంలో మండల సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించాలని, నిలుపుదల చేస్తూ ఇచ్చిన 1214 మెమోని తక్షణం రద్దు చేయాలని, 2019 నుంచి పెండింగ్లో పెట్టిన క్లైముల పరిహారాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున కార్మికులంతా మార్చి 1న పెద్దఎత్తున చలో కలెక్టరే ట్‌లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధి కారి మలకా రమణ, కామిరెడ్డి సురేష్‌, యూనియన్‌ సభ్యులు నున్న తాతీలు, శివ, సుబ్రమణ్యం, నూకరాజు, వై. సుబ్రమణ్యం, రాంబాబు పాల్గొన్నారు.

➡️