విద్యార్థికి పలువురి సాయం

Mar 31,2024 21:31
చదువు కోవడానికి ఆర్థిక

ప్రజాశక్తి – తాళ్లరేవు

చదువు కోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థికి పలువురు ఆర్థిక సాయాన్ని అందించారు. మండలంలోని ఇంజరం గ్రామానికి చెందిన విద్యార్థిని పల్లం ప్రియాంకకు ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ రూ. 15 వేలు, చింతలపాటి శ్రీనివాసరాజు రూ.5 వేలు, స్థానిక సర్పంచ్‌ ముద్దన వెంకటశివరామప్రసాద్‌ రూ.2,500, ఎంపిటిసి సభ్యులు కోరుకొండ కిరణకుమారి, చంటి దంపతులు రూ. 2,500 నగదును అందజేశారు. ఈ సందర్భంగా దాతల సేవ లను పలువురు కొనియాడారు. ఈ సందర్భం గా కుడుపూడి శివన్నరాయణ మాట్లాడుతూ విద్యార్థి ప్రియాంక తండ్రి పల్లం రాజారత్నం కరోనా సమయంలో మరణించడంతో ఇంట ర్మీడియట్‌ కళాశాల నుంచి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతుం దని తెలిపారు. వైద్య వృత్తి కోర్సు చదవాలన్న విద్యార్థి ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని దాతలు సహకరించాలని కోరారు ఈ కార్య క్రమంలో విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్య క్షులు వడ్డి ఏడుకొండలు, ఉపసర్పంచ్‌ కోరు కొండ అప్పారావు, పెయ్యల కొండబాబు, జగనన్న సేవా సమితి నాయకులు దడాల సువర్ణలత పాల్గొన్నారు.

➡️