స్థలాలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు ఎలా..?

Feb 12,2024 23:26
తమకు స్థలాలు

ప్రజాశక్తి – సామర్లకోట

తమకు స్థలాలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్‌ ఏవిధంగా చేస్తున్నారని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. మండలంలోని వెంకట కృష్ణ రాయపురం గ్రామంలో అందరికీ ఇళ్ళు పథకంలో చేపడుతున్న పట్టాలకు రిజిస్ట్రేషన్‌ కార్య క్రమాన్ని సోమవారం లబ్ధిదారులు అడ్డుకున్నారు. తమకు స్థలాలు అప్పగించకుండా ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని పట్టాలను చూపిస్తూ అధికారులను నిలదీశారు. తమ ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమి వద్దని లబ్ధిదారులు అధికారులకు స్పష్టం చేశారు. ఈ వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో లబ్ధిదారులు ఈ ప్రక్రియను సోమవారం అడ్డుకున్నారు. ఈ సం దర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 350 ఇంటి స్థలాలకు పట్టా లు ఇచ్చారని తెలిపారు. అయితే తమకు ఇప్పటి వరకూ స్థలాలు అప్పగించలేదన్నారు. ఈ పట్టాలు రిజిస్ట్రేషన్‌ కొరకు సచివాలయానికి సచివాలయం సిబ్బంది రమ్మని చెబితే వచ్చామన్నారు. అయితే రిజిస్ట్రేషన్‌ చేసేముందు మాకు స్థలాలు చూపించి చేయాలని వారు అధికారులకు స్పష్టం చేశారు. అప్పటి వర కూ రిజిస్ట్రేషన్‌లు ఆపాలని వారు డిమాండ్‌ చేశా రు. దీనిపై విఆర్‌ఒ మాట్లాడుతూ లబ్ధిదారులు లేవనెత్తిన అంశాన్ని తహశీల్దార్‌ దృష్టికి తీసు కెళ్లినట్లు తెలిపారు.

➡️