18 సమస్యాత్మక పోలింగ్‌ ప్రాంతాలు

May 12,2024 22:43
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో

ప్రజాశక్తి – సామర్లకోట, పెద్దాపురం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో 18 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ఆర్‌ఒ సీతారామారావు, డిఎస్‌పి లతాకుమారి తెలిపారు. పెద్దాపురం అర్బన్‌, సామర్లకోట అర్బన్‌, పెద్దాపురం రూరల్‌ పరిధిలో కాండ్రకోట, కట్టమూరు, గుడివాడ, ఉలిమేశ్వరం, మర్లవ, తిరుపతి, తాడిపర్తి, దివిలి, పులిమేరు, చిన్న బ్రహ్మదేవం, సామర్లకోట మండలంలో వేట్లపాలెం, మేడ పాడు పెద్ద బ్రహ్మ దేవం, హుస్సేన్‌ పురం, వెంకటకృష్ణ రాయపురం, మాధవపట్నం, పి. వేమవరం గ్రామాలను గుర్తించి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతివారు పూర్తి సహకారాన్ని అందించాలని వారు కోరారు.

➡️