ప్రజాశక్తి – కాకినాడ
జిల్లాలో దొంగిలించబడిన, పోగొట్టుకున్న 600 సెల్‌ఫోన్ల రికవరీ చేయడం జరిగిందని, ఇప్పటివరకూ సెల్ ఫోన్ల రికవరీలో ఇదే అత్యధికమని ఎస్‌పి విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం పోలీసు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గత కొంత కాలంగా మిస్ అయిన, దొంగిలించ బడిన మొబైల్ ఫోన్‌ల కొరకు ప్రత్యేక పర్యవేక్షణలో మోబి ట్రాక్ కాకినాడ పోలీసు సాంకేతిక సేవల ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను కాకినాడ ఐటి కోర్ బృందం, జిల్లాలోని పోలీస్ స్టేషన్‌ల క్రైమ్ బృందాలు సంయుక్త కృషితో రికవరీ చేసిన సుమారు రూ.78 లక్షల విలువ గల 600 సెల్ ఫోన్లను సంబంధిత ఫిర్యాదుదారులకు అందించినట్లు చెప్పారు. సెల్ ఫోన్ల రికవరీలో విశేషమైన కృషి చేసిన ఐటి. కోర్ టీం ఇన్‌స్పెక్టర్ డి.దుర్గాశేఖర్‌రెడ్డి, ఐటి కోర్ బృంద సభ్యులు, ఆయా పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు, సిఐలు, డిఎస్‌పిలు, సంభందిత సిబ్బందిని ఆయన అభినందిం చారు. మిస్ అయిన లేదా దొంగలించబడ్డ తమ ఫోన్‌లను తిరిగి పొందడం కోసం బాధితులు మోబి ట్రాక్ కాకినాడ పోలీసు సేవలను ఉపయోగిం చుకోవడానికి 9490617852 నంబర్ వాట్సప్‌కు హారు లేదా హలో అని ఏదైనా మెసేజ్ ఇవ్వాలని తెలిపారు. అలా మెసేజ్ ఇచ్చిన తర్వాత వచ్చిన లింక్ నందు వివరాలు నమోదు చేయడం ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఇఐఆర్ వెబ్‌సైట్ ష్ట్ర్‌్‌జూర://షషష.షవఱతీ.స్త్రశీఙ.ఱఅలో కూడా దొంగలించబడ్డ ఫోన్‌ల కొరకు ఫిర్యాదు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా దొంగలించబడ్డ తమ విలువైన ఫోన్లను రికవరీ చేసిన ఎస్‌పికి, జిల్లా పోలీసు యంత్రంగానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ డిఎస్‌పి శ్రీరామ కోటేశ్వరరావు, ఐటి కోర్ ఇన్‌స్పెక్టర్ డి.దుర్గాశేఖర్‌రెడ్డి, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్ పి.ఈశ్వరుడు పాల్గొన్నారు.