9వ రోజు జిజిహెచ్‌ వర్కర్స్‌ ఆందోళన

Feb 9,2024 22:40
9వ రోజు జిజిహెచ్‌ వర్కర్స్‌ ఆందోళన

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ చేపట్టిన ఆందోళన 9వ రోజైన శుక్రవారం కూడా కొనసాగించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కార్మికులతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో కాంట్రాక్టు సంస్థ తరపున బి.గంగరాజు, గోకేడ రాంబాబు, మోహన్‌, కార్మికుల తరపున సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, యూనియన్‌ నాయకులు సిహెచ్‌.విజరుకుమార్‌, జె.శేషు, ఆర్‌.రమేష్‌, ఎస్‌.వాసు, జె.లక్ష్మీ ప్రియ, బి.మంగతాయారు, కృష్ణవేణి, రమణమ్మ, శ్రీకాంత్‌, రవి పాల్గొన్నారు.

➡️