మత్స్యకారులకు రూ.94కోట్ల పరిహారం

Feb 11,2024 08:26 #Kakinada
94 crore compensation to fishermen

త్వరలో లబ్దిదారుల అకౌంట్లలో జమ

– ఎమ్మెల్యే అశోక్

ప్రజాశక్తి – యానాం : యానాం నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారులకు అందాల్సిన ఓఎన్జిసి నష్టపరిహారం అతి త్వరలో లబ్దిదారుల అకౌంట్లలోకి జమ అవుతాయని ఆవిధంగా రూ.94కోట్ల7లక్షల అరవై తొమ్మిది వేలు రానున్నాయని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నష్టపరిహారం ఇప్పటికే అందాల్సివుందని ఆ తీవ్ర జాప్యాన్ని నివారించే విధంగా తాను ఇటీవలి న్యూఢిల్లీ వెళ్లి ఒఎన్జిసి ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరిత గతిన పరిహారం ఇచ్చేవిధంగా వారిని ఒప్పించినట్లు తెలిపారు. మొత్తం 5వేల 462 మందికి గాను రూ.71కోట్ల 76 లక్షల9వేలను పుదుచ్చేరి మెంబర్ సెక్రటరీ వారి ఖాతాలో ఈ సొమ్ము జమ చేస్తారని సోమవారం ఆ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అనంతరం ఆ సోమ్మును ముఖ్యమంత్రి రంగసామి, మత్స్యశాఖామంత్రి లక్ష్మీనారాయణ తదితరులు యానాం వచ్చి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి లబ్దిదారులకు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొంత మొత్తం రూ.23కోట్లు ఇప్పటికే ప్రభుత్వ ఖాతాలో ఉన్నాయని ఆవిధంగా మొత్తం రూ. 94కోట్ల 7లక్షల అరవైతొమ్మిదివేలును లబ్దిదారుల ఖాతాలో జమ అవుతాయన్నారు. ఇప్పటివరకు 14నెలలకు గాను పరిహారం ఒఎన్జిసి నుంచి వచ్చిందని కాని మొత్తం పరిహారం ఎక్కువ నెలలు ఇవ్వాలనే తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిపారు. నెలలుగా పరిహారం ఇచ్చేవిధంగా చేయడానికి యుసి ఇచ్చేందుకు ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పరిహారం పంపిణీలో రాజకీయాలకు తావులేకుండా పూర్తి పరిహారం ప్రతి మత్స్యకారుడుకు ఇవ్వాలని ఆ సోమ్ము వారికే దక్కాలన్నదే తన ప్రధాన అభిమతన్నారు. పరిహారం పంపిణీ అనంతరమే అన్ని విషయాలను మాట్లాడతానని స్పష్టం చేశారు.

➡️