ప్రజాశక్తి – కాకినాడ
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెం టులో ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ ఉల్లంఘనే అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘వక్ఫ్ చట్ట సవరణ – మైనారిటీలపై మరోదాడి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడారు. వక్ఫ్ చట్టంలో 44 సెక్షన్లు సవరిం చారని తెలిపారు. బిజెపి ఈ చట్ట సవరణ గురించి గొప్పగా చెబుతూ ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తుందని అన్నారు. వక్ఫ్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని ఆయన గుర్తు చేశారు. బిజెపి చర్యలు మైనారిటీల లక్ష్యంగా ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ అంతిమంగా రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా చూడాలన్నారు. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయ కులు సిహెచ్.నాగేశ్వరరావు, గొడుగు సత్యనారా యణ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, వైసిపి నాయకులు బషీర్, హ్యూ మన్ రైట్స్ ఫోరం నాయకులు ఇక్బాల్, సామాజిక కార్యకర్త దూసర్లపూడి రమణరాజు, ఐఎన్‌టియుసి నాయకులు తాళ్ళూరి రాజు, రిపబ్లికన్ పార్టీ నాయ కులు పిట్టా వరప్రసాద్ తదితరులు మాట్లాడారు. రాజ్యాంగ పరిషత్తులో చర్చల సందర్భంగా అంబేద్కర్ ప్రజాస్వామ్యం గురించి వివరించారని అన్నారు. మైనారిటీ హక్కుల రక్షణే ప్రజా స్వామ్యంలో కీలకమని చెప్పిన విషయాన్ని గమనించాలన్నారు. వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాం గంపై జరుగుతున్న దాడిగా చూడాలన్నారు. విస్తృత ప్రజాసమీకరణతో బిజెపి విధానాలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. దేశంలో రైతాంగ ఉద్యమమే మోడీ మెడలు వంచిన విషయాన్ని గమనించాలన్నారు. అదే స్పూర్తితో ప్రజలంతా వివిధ సంఘాల ద్వారా ఏకమై రాజ్యాం గాన్ని రక్షించుకోవాలని, బిజెపిని గద్దె దించాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ బిజెపి దాడి ముస్లింలతో ఆగదని యావత్ కష్టజీవుల హక్కులను హరిస్తుందన్నారు. తద్వారా కార్పోరేట్‌లకు దేశ సంపదను దోచిపెడు తుందన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు వందన సమర్పణ చేశారు. ఈ సమావే శంలో కాంగ్రెస్ నాయకులు బి.జయప్రకాష్, ఎస్‌ఐఒ నాయకులు షేక్ జియావుద్దీన్, జానీ, ఆవాజ్ నాయకులు ఇబ్రహీం, సిపిఎం నాయకులు నీలపాల సూరిబాబు, సిహెచ్.రమణి, కెఎస్ శ్రీనివాస్, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకట రమణ, కె.నాగజ్యోతి, దుర్గారావు, మూర్తి పాల్గొన్నారు.