ప్రజాశక్తి – కాజులూరు, గొల్లప్రోలు, రైతులపూడి
క్రీడలుతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గొల్లపాలెం ఎస్‌ఐ ఎం.మోహన్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక జడ్‌పి పాఠశా లలో సంక్రాంతిని పురష్కరించుకుని వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్య కలాపాల్లో యువత పాల్గొనకుండా ఉండేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ క్రీడలను నిర్వహిస్తుందన్నారు. యువత కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండేందుకే ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంక్రాంతి సంద ర్భంగా యువత అంతా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి, కాదా కోటేశ్వరరావు, యాళ్ళ వెంకటరమణ, చాగంటి సోమన్న, తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎన్.రామకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని అన్నారు. గుండాట, పేకాట, కోడిపందాలు వంటి జూద క్రీడలు నిర్వహించవద్దని తెలిపారు. గ్రామాల్లో అటువంటి జూడ క్రీడలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్రికెట్ పోటీలో గెలిచిన జట్టుకు ఆయన బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రౌతులపూడి మండలంలోని లచ్చి రడ్డిపాలెం గ్రామంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. గత 3 రోజులుగా నిర్వహించిన పోటీలో విన్నర్‌గా గేమ్ చేంజెస్ జట్టు నిలిచింది. రన్నర్‌గా సీజన్ విన్నర్స్ జట్లు గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా చిట్రా అశోక్ తేజ ఎంపిక య్యారు. వీరికి గ్రామ నాయకులు కోటిపల్లి రాజు, గుర్రం రాంబాబు, అల్లం ప్రసాద్, గింజల అప్పలరాజు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎం.గంగసూరిబాబు పాల్గొన్నారు.