ప్రజాశక్తి – తాళ్లరేవు, ఏలేశ్వరం, పెద్దాపురం
స్థానిక ప్రజాసంఘాల భవనంలో గుర్రం జాషువా 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్య క్రమంలో విశ్వజన కళామండలి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జాషువా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ప్రజా సంఘాల నాయకులు టేకు మూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు మాట్లాడారు. జాషువా చిన్నతనంలోనే కుల వివక్షతకు గుర య్యారని అన్నారు. గబ్బిలం రచన ద్వారా సమాజంలో ఉన్న కుల వివక్షతను పారద్రో లడానికి విశేష కృషి చేశారన్నారు. ఈ కార్య క్రమంలో విశ్వజన కళామండలి రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులు వీరప్రసాద్, వల్లు రాజబాబు, ఈశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యడ్ల సురేష్ కుమార్, ఎలమంచిలి బాలరాజు, అత్తిలి బాబు రావు, విప్పర్తి శ్రీనివాస్, రిటైర్డ్ జెడి పెట్ల సూర్య నారాయణరాజు పాల్గొన్నారు. ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాషువా జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇ.చెన్నారావు, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ ప్రగడ ప్రయాగమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురం పట్టణంలోని యాసలపు సూర్యారావు భవనంలో ప్రజానాట్య మండలి మండల కార్యదర్శి రొంగల వీర్రాజు అధ్యక్షతన గుర్రం జాషువా జయంతిని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవం తి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జోష్యుల కృష్ణబాబు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి కార్యదర్శి కొత్త శివ, ప్రజానాట్యమండలి నాయ కులు దారపురెడ్డి కృష్ణ, మహపాతిన రాంబాబు, చల్లా దుర్గాప్రసాద్, బల్లమూడి సూర్యనారా యణమూర్తి, రొంగల సుబ్బలక్ష్మి, భాస్కర్, గరగపాటి పెంటయ్య, ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.