ఘనంగా సమ్మర్‌ క్యాంప్‌ ముగింపు వేడుకలు

May 16,2024 22:45
మండలంలోని ఉండూరు

ప్రజాశక్తి – సామర్లకోట

మండలంలోని ఉండూరు లక్ష్య ఇంటర్నేషనల్‌ పాఠశాల ప్రాంగణంలో కిండర్‌ వండర్‌ సమ్మర్‌ క్యాంప్‌ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జె.నివాస్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్‌ పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సుగుణారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్‌ వందనా బోహ్రా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులలో సృజనాత్మకతను వెలికితీయడానికి, వారికి మానసిక ఉత్సాహాన్ని కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడానికి మరియు వారిలో నాయకత్వ లక్షణాలను మెరుగు పరుచుకోవడానికి ఇటువంటి కాంప్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సుగుణా రెడ్డి మాట్లాడుతూ సమ్మర్‌ క్యాంప్‌లో నేర్చుకున్న వివిధ అంశాలను ప్రతీ ఒక్కరూ జీవితంలో సద్వినియోగ పరుచుకోవాలని, తార్కికశక్తిని, దేహధారు డ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, సృజనాత్మకత, గాన నైపుణ్యం మొదలైన విభాగాలలో వారి అభిరుచులను పెంపొందించు కోవడానికి ఈ ”సమ్మర్‌ క్యాంప్‌’ ఎంతగానే ఉపయోగ పడుతుందని అన్నారు. విద్యార్ధులకు సంగీతం, కుకింగ్‌, పిరమిడ్స్‌, శ్లోకాలు, స్విమ్మింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, నృత్యం, కోడింగ్‌, స్టోరీ టెల్లింగ్‌, గుర్రపు స్వారీ మొదలైన విభాగాలలో అనుభవుజ్ఞులైన ఉపాధ్యా యుల సమక్షంలో సరియైన శిక్షణ ఇవ్వబడిందని ఆమె తెలిపారు. ప్రిన్సిపల్‌ వందనా బోహ్రా మాట్లాడుతూ సమ్మర్‌ క్యాంప్‌ ప్రారంభం నుంచి ఎంతో ఉత్సాహంగా జరిగిందని, విద్యార్ధినీ విద్యార్థు లు అన్ని విభాగాలను ఎంతో క్రమ శిక్షణతో నేర్చుకు న్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యా ర్థులు పలు గీతాలను, శ్లోకాలు ఆలపించి, వివిధ రకాల నీత్య ప్రదర్శ నలు చేశారు. విభిన్న రీతులలో పలురకాల పిర మిడ్స్‌ నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్యాంప్‌లో విద్యార్ధులు తయారు చేసిన కళాఖండాలు, రూపొం దించిన చిత్రాలు చూపరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

➡️