వికలాంగులకు చేయూత 

Jun 10,2024 14:27 #Kakinada

ప్రజాశక్తి-ఏలేశ్వరం: స్థానిక క్వారిపేటలోని 20 మంది దివ్యాంగులకు సురక్ష జిల్లా వికలాంగుల వయోవృద్ధుల సేవాశ్రమం జిల్లా అధ్యక్షురాలు అంబటి రాజకుమారి నిత్యవసర వస్తువుల కిట్టులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు పెన్షన్ నెలకు 6000 ఇస్తామన్న కొత్త ప్రభుత్వం హామీను వెంటనే అమలు చేయాలని కోరారు. దివ్యాంగులు మనో నిబ్బరం కోల్పోకుండా సమాజంలో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ ద్వారా ప్రతినెల 20 మంది దివ్యాంగులకు నిత్యవసర వస్తువుల కిట్లను అందజేస్తున్నామని ఆమె తెలిపారు. జిల్లాలోని ప్రతి దివ్యాంగులు విధిగా సభ్యత్వం చెల్లించడం వలన ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను పొందే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. నూతన ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, వారికి అండదండలుగా ఉంటారని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి జి గణపతి, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి యేసు, బి శ్రీను, ఎం సత్యం, కే గోవింద్, దివ్యాంగులు ఉన్నారు.

➡️