జిజిహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Dec 4,2024 23:21
వైద్యులు విజయవంతం చేశారు.

ప్రజాశక్తి – కాకినాడ

స్థానిక జిజిహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతం చేశారు. రామచం ద్రపురంకు చెందిన పవన్‌ కుమార్‌ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు టైల్స్‌ క్లీనింగ్‌ యాసిడ్‌ను మింగేశాడు. దీంతో అతని అన్నవాహిక కృషించిపోవడంతో ఆహా రం, మంచినీరు తీసుకోలేని పరిస్థి తిలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో వైద్య నిమిత్తం జిజిహెచ్‌లో జాయిన్‌ అయ్యాడు. దీంతో జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ సర్జరీ డాక్టర్‌ ఎ.కిషోర్‌ బాబు అతని అన్నవాహికను తొలగించి, దానికి బదులుగా ఎడమవైపు పెద్ద పేగును ప్రత్యామ్నాయంగా మార్చి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఇటువంటి సంక్లిష్ట ఆపరేషన్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ లో మొదటిసారి విజయవంతం చేయడానికి కృషి చేసిన శస్త్ర చికిత్స బృందం వైద్యులు డాక్టర్‌ సమంతకుమార్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ శివరాంప్రసాద్‌, డాక్టర్‌ కావ్య, అనస్థీసియా విభాగాధిపతి డాక్టర్‌ విష్ణువర్ధన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శకుంతల ను సూపరింటెండెంట్‌ డాక్టర లావణ్యకుమారి అభినందించారు. గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులచే అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️