కాకినాడ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణకు కలెక్టర్ షాన్ మోహన్, ఎస్‌పి జి.బిందు మాధవ్, జిల్లా 4వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నిరుపమ, ఎఎస్‌పి మానిష్ పాటిల్ దేవరాజ్, ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు పుష్పగుచ్చాలు, పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు అన్నవరం సత్యనారాయణ స్వామిని ఎన్‌వి.రమణ దర్శించుకోనున్నారు.
