ఎంఎల్‌ఎ సత్యప్రభను కలిసిన వైద్యుల బృందం

Jun 8,2024 23:10
ప్రతిపాడు నియోజకవర్గ

ప్రజాశక్తి – రౌతులపూడి, ఏలేశ్వరం

ప్రతిపాడు నియోజకవర్గ ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభను రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎకు బృందం సభ్యులు సత్యప్రభకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను ఎంఎల్‌ఎకు వివరించారు. ఎంఎల్‌ఎను కలిసిన వారిలో వైద్య అధికారి జానకిదేవి. డాక్టర్‌ పావని, డాక్టర్‌ సునీత, ఆరోగ్య మిత్ర శ్రీనివాస్‌ తదితరులున్నారు. అలాగే ప్రత్తిపాడు బార్‌ అసోసియేన్‌ సభ్యులు ఎంఎల్‌ఎను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.కుక్కుటేశ్వరరావు, బొంగుళూరి మధుబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో అటు ప్రజలకు, న్యాయవాదులకు నష్టం వాటిల్లేలా చట్టం చేసిందన్నారు. ఆ చట్టాన్ని రద్దు పరచి రాష్ట్ర ప్రజలకు, న్యాయవాదులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆర్‌.వెంకట్రావు, స్పోర్ట్స్‌ కార్యదర్శి గౌరీశంకర్‌, మాజీ అధ్యక్షులు చెల్లంకూరి రామకృష్ణ, చట్టంశెట్టి పుల్లయ్య, న్యాయవాదులు బాద జాన్‌బాబు, మళ్ళ గంగాధర్‌, మూది నారాయణస్వామి పాల్గొన్నారు.

➡️