ప్రజాశక్తి – కాకినాడ
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను జిల్లా 15శాతం మించి స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా సిద్దం చేయాలని కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ 2047 విజన్ లక్ష్యాల కనుగుణంగా రాబోయే ఐదేళ్లలో వివిధ గ్రోత్ సెక్టార్లలో చేపట్టాల్సిన జిల్లా కార్యాచరణ రూపకల్పనపై ప్రత్యేక మేధోమధన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదరుశ్రీనివాస్, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, ఎంఎల్‌ఎ వనమాడి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి ప్రజల తలసరి ఆదా యం 45 వేల డాలర్లతో, 15 శాతం గ్రోత్ రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాన్ని చేపట్టిందన్నారు. ఈ లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా కీలక భాగస్వామ్యం వహిం చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా రంగాల భాగస్వామ్య వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. జిల్లాలో స్థూల ఉత్పత్తిని పెంచేందుకు దోహదం చేసే 14 ప్రభుత్వ శాఖల ద్వారా లక్ష్యాలను నిర్థేశించుకుంటూ విజన్ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, పశుసంవర్ధక, మత్య్స, స్కిల్ డవెలప్‌మెంట్, మున్సి పల్ పరిపాలన వంటి శాఖలపై ప్రత్యేకంగా సమీ క్షించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదరు శ్రీని వాస్ మాట్లాడుతూ కంపెనీలు, పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలల్లో యువతకు శిక్షణ కల్పించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి కల్పించాలని సూచించారు. పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సా హికులకు కల్పించేందుకు అనువైన భూమిని గుర్తిం చాలని కోరారు. మత్స్యకారులకు బోట్ల మంజూరు, ఇన్స్యూరెన్స్, ఆయిల్ సబ్సిడీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాని నివేదిస్తామన్నారు. చర్చించిన అంశాలతో విజన్ ప్రణాళిక డాక్యుమెంట్‌ను సిద్దం చేయా లన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ భావ న, డిఎఫ్‌ఓ భరణి, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ ఎస్.భావన, సిపిఓ త్రినాథ్, వ్యవసాయ శాఖ జెడీ ఎన్.విజయకుమార్, ఉద్యానవన శాఖ డిడి జివివివి డి.ప్రసాదరావు, పశుసంవర్థక శాఖ జెడీ ఎస్.సూర్య ప్రకాషరావు, మత్స్యశాఖ డిడి ఎ.కరుణాకరరావు, పరిశ్రమల శాఖ జిఎం గణపతిరావు, టూరిజం అధికారి పి.పోసయ్య, తదితరులు పాల్గొన్నారు.