ప్రజాశక్తి – పెద్దాపురం, పిఠాపురం
నూతన ఎల్‌ఐసి పాలస ీలపై ఏజెంట్లకు ఇచ్చే కమీషన్‌లో కోత పెట్టడాన్ని నిరసిస్తూ ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఎల్‌ఐసి ఏజెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో అసోసియేషన్ అధ్య క్షులు అప్సాన నాగేశ్వరరావు, కార్యదర్శి గుండెల జగదీశ్వరరావు మాట్లాడారు. గ్రామీణ పాలసీదారులకు అవసరమైన పాలసీలపై చేతికం దే సొమ్మును 2 లక్షలకు పెంచడం వల్ల సన్న, చిన్నకారు రైతులకు ప్రీమియం కట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అటువం టిప్పుడు ప్రీమియం రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అసోసియేషన్ కోశాధికారి బిఎన్ ఆర్.శాస్త్రి, ఉపాధ్యక్షులు కొండపల్లి అర్జున రావు, సామిరెడ్డి, సహాయ కార్యదర్శి వాసంశెట్టి గంగ, గౌరవ అధ్యక్షులు ఎస్.గౌరీపతిరావు, సభ్యులు పాల్గొన్నారు. అలాగే పిఠాపురం ఎల్‌ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెంట్ల అసోసియేషన్ నాయ కులు మాట్లాడుతూ ఎల్‌ఐసి చేపట్టిన నూతన వ్యాపార విధానాలు ఏజెంట్ వ్యవస్థను నాశనం చేసేలా ఉందన్నారు. ఏజెంట్లు వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కమీషన్ రేట్లు తగ్గించిందని ఆరోపిం చారు. తక్షణం కమీషన్‌ను పూర్వం పద్ధతిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ కౌన్సిల్ ఏజెంట్స్ అసోసి యేషన్ అధ్యక్షులు రావుల మాధవరావు, బ్రాంచ్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లోకారెడ్డి రామకృష్ణ, కెవివి.సత్యనారాయణ, ఉడతా రామచంద్రరావు పాల్గొన్నారు.