ఎయిడెడ్‌ కళాశాలలను పునరుద్ధరించాలి

Oct 10,2024 22:10
ఎయిడెడ్‌ కళాశాలలను పునరుద్ధరించాలి

ప్రజాశక్తి – పెద్దాపురం గత ప్రభుత్వ హయాంలో 42 ఆర్డినెన్స్‌ ద్వారా రద్దు చేసిన ఎయిడెడ్‌ కళాశాలలను తిరిగి ఎయిడెడ్‌ కళాశాలలుగా పునరుద్ధరించాలని కోరుతూ గురువారం ఎయిడెడ్‌ కళాశాలల పార్ట్‌ టైం లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వి.లక్ష్మి ఆధ్వర్యంలో మంగళగిరిలో జనవాణి కార్యక్రమంలో పెందుర్తి ఎంఎల్‌ఎ పంచకర్ల రమేష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడెడ్‌ కళాశాలలను అన్‌ఎయిడెడ్‌ కళాశాలలుగా మార్చడం వల్ల అట్టడుగు, పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఫీజుల భారం భారీగా పెరుగుతుందన్నారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎయిటెడ్‌ లెక్చరర్స్‌ను క్రమబద్ధీకరించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️