మాజీ మంత్రి వైసిపి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం
ప్రజాశక్తి-కిర్లంపూడి : కాకినాడ జిల్లా కిర్లంపూడిలో గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ముద్రగడ పద్మనాభం అన్నారు. అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.