ఆకట్టుకున్న మోడల్‌ పోలింగ్‌ కేంద్రం

May 12,2024 22:45
పట్టణంలోని యార్లగడ్డ

ప్రజాశక్తి – సామర్లకోట

పట్టణంలోని యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్‌ హైస్కూల్లోని 134 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రాన్ని మోడల్‌ కేంద్రంగా అధికారులు సిద్ధం చేశారు. ఈ కేంద్రాన్ని మున్సి పల్‌ కమిషనర్‌ జాస్తి రామా రావు, తహశీల్దార్‌ ఏడిద శ్రీని వాస్‌ రిబ్బను కత్తిరించి ఆది వారం సాయంత్రం ప్రారంభించారు. పండగను తలపించే విధంగా ఆకర్షనీయమైన ముఖ ద్వారం, మామిడి తోరణాలతో అలంకరించిన ద్వారాబంధాలు, ఓటర్లకు ఆహ్వానం తెలిపేం దుకు ఏర్పాటు చేసిన ఆకుపచ్చ తివాచీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ పోలింగ్‌ కేంద్రంలో 661 మంది పురుషులు, 695 మంది మహిళలు వెరసి మొత్తం 1,356 మంది ఓటర్లు వారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

➡️