పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

Jun 9,2024 23:26
కొమరగిరి గ్రామంలో స్థానిక

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

కొమరగిరి గ్రామంలో స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో 2000-01 10వ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా జరిగింది. 24 సంవత్సరాల తరువాత వారికి విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను ఒకే వేదికపై తీసుకొచ్చారు. పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరు వేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాల తీపి కబుర్లు, తమ అనుబంధాలను స్మరించుకున్నారు. ఒకరికొకరు చెప్పుకుంటూ సెల్ఫీలు తీసుకుని ఆనందోత్సాహాలతో గడిపారు. పూర్వ విద్యార్థులు అధ్యాపకులకు శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులను ఒక చోటకు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన పూర్వ విద్యార్థులు కాదులూరి సుబ్బలక్ష్మి, కృష్ణవేణి, ప్రకాష్‌రెడ్డి, రమణ, అధ్యాపకులతోపాటు పూర్వ విద్యార్థులు శాలువాతో సన్మానించి అభినందించారు.

➡️