అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

Oct 28,2024 23:00
అర్జీలను అత్యంత నాణ్యతతో త్వరితగతిన

ప్రజాశక్తి – కాకినాడ

పిజిఆర్‌ఎస్‌ కార్య క్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పరిష్కరిం చాలని కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టర్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, హౌసింగ్‌ పీడీ ఎన్‌వివి.సత్యనారాయణ, సిపిఒ త్రినాథ్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఏ.శ్రీనివాసరావు, డీపీఎం ఎస్‌డిసి లావణ్య లతో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలన్నారు. రెవెన్యూ, పింఛన్‌, రేషన్‌ కార్డుల మంజూరు, టిడ్కొ గృహాలు, ఇళ్ల స్థలాలు, కేెఎస్‌ఇజడ్‌ భూమి ఆన్‌లైన్లో నమోదు, ఆక్రమణలు తొలిగింపు, డ్రెయిన్‌, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికేట్‌ మంజూరు, వైద్య ఆరోగ్యం, ఆరోగ్య శ్రీ సేవలు, ఉద్యోగ ఉపాధి అవకా శాలు వంటి అంశాలకు చెందిన 428 అర్జీలు అందాయి. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీ లను క్షుణ్ణంగా పరిశీలించి, గడువు లోపు అర్జీదారుడు సంతృప్తి చెం దేలా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులుపాల్గొన్నారు.

➡️