ఎపిఆర్‌పిఎ రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణరాజు మృతి

Jun 8,2024 23:07
యుటిఎఫ్‌ సీనియర్‌

ప్రజాశక్తి – కాకినాడ

యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి చుక్కన సత్యనా రాయణరాజు శనివారం స్థానిక మధుర నగర్‌లో గల ఆయన కుమారుని ఇంటిలో కార్డియాటిక్‌ అరెస్టుతో మృతి చెందారు. యుటిఎఫ్‌ సీనియర్‌ లీడర్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి, రిటైర్డు గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్‌ చుక్కన సత్యనారాయణరాజు మృతి పట్ల ఎంఎల్‌సి ఐ.వెంక టేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శనివారం జరిగిన అంతిమ యాత్ర కాకినాడ మధురా నగర్‌ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద గల హిందూ స్మశాన వాటిక వరకు ఎంఎల్‌సి ఐవి, యుటిఎఫ్‌ జిల్లా శాఖ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ కాకినాడ జిల్లా అధ్యక్షులు కె.నగేష్‌, ప్రధాన కార్యదర్శి తోటకూర రవిచక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాం, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ, సహాధ్యక్షులు వివి. రమణ, కె.గోవిందరావు, సీనియర్‌ నాయకులు జి.చిట్టి బాబు, పి కృష్ణంరాజు, కె.సత్తిరాజు, జిల్లా కార్యదర్శి మూర్తి, ఎపిఆర్‌పిఎ రాష్ట్ర నాయకులు పి.అజరుకుమార్‌, ఎన్‌ఎ ఎస్‌ శాస్త్రి, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సిహెచ్‌. మోహన్‌రావు, కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు కర్రి బాబురావు, జార్జ్‌ బర్నబస్సు, జన విజ్ఞాన వేదిక నాయకులు కెఎంఆర్‌.ప్రసాదు వర్మ, పి.గిరిధర్‌ గోపాల్‌, సిహెచ్‌వి.రమణ, పి.రాజబాబు, జె.అప్పారావు, కెఎం ఎంఆర్‌.ప్రసాద్‌, జెవివి నాయకులు వర్మ, పేపకాయల రాజబాబు, శ్రీరామారావు, బివివి.సత్యనా రాయణ, వి చంద్రశేఖర్‌, డాక్టర్‌ అంబేద్కర్‌ జిల్లా యూటిఎఫ్‌ నాయకులు పెంకే వెంకటేశ్వరరావు, ఎంటివి.సుబ్బారావు, బేతినీడి శ్రీను పాల్గొన్నారు.

ఎపిఆర్‌పిఎ రాష్ట్ర, జిల్లా కమిటీల సంతాపం

చుక్కన సత్యనారాయణరాజు అకాల మరణానికి ఎపిఆర్‌పిఎ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. యూనియన్‌ రాష్ట్ర నాయకులు కె.సత్తిరాజు మాట్లాడుతూ సత్యనారాయణ రాజు ఎపిఆర్‌పిఎ ఆవిర్భావానికి ఎంతో కృషి చేశారన్నారు. దేశస్థాయిలో ఇపిఎఫ్‌ పెన్షనర్ల సమస్యలపై అలుపెరగని పోరాటం నిర్వహించారన్నారు. జిల్లా కార్యదర్శిగా పెన్షనర్ల సమస్యలపై పోరాటాల నిర్వహించి సమస్యల పరిష్కా రానికి కృషి చేశారన్నారు. సత్యనారాయణ రాజు మరణం పెన్షనర్ల ఉద్యమానికి తీవ్రమైన లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

➡️