విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం

Jan 15,2025 22:01
సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన

సంక్రాంతి సందర్భంగా వివిధ సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు, ఇతర క్రీడా పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు.

ప్రజాశక్తి – యంత్రాంగం

పెద్దాపురం డివైఎఫ్‌ఐ, ఐద్వా, సిఐటియు, పిఎన్‌ఎం, పిసిసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ఆటల పోటీల బహుమతుల ప్రధానోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, 14వ వార్డ్‌ కౌన్సిలర్‌ తాటికొండ వెంకటలక్ష్మి మాట్లాడారు. అలాగే నువ్వుల గుంట వీధి లో నిర్వహించిన ఆటల పోటీల ముగింపు బహుమతి ప్రధానోత్సవ సభలో 18వ వార్డు కౌన్సిలర్‌ నీలంశెట్టి అమ్మాజీ పాల్గొని మాట్లాడారు. అనంతరం అతిథిల చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సభల్లో భళ్లమూడి సూర్యనారాయణమూర్తి, మండవిల్లి భాస్కరరావు, తమనారి సత్యనారాయణ, టమడపు బాబురావు, ముర్రి వీర్రాజు, దారపురెడ్డి కృష్ణ, రొంగల సుబ్బలక్ష్మి, షేక్‌ నాగూర్‌, డి.సత్యనారాయణ, కె.అరుణ, గరగపాటి పెంటయ్య పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ రూరల్‌ మండలం చీడిగ గ్రామంలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి 3 రోజులు ముగ్గులు పోటీలతో పాటు, ఇతర ఆటలు, పాటలు, నృత్యాల పోటీలు జరిగాయి. వీటిలో పాల్గొన్న వారందరికీ బహుమతులతో పాటు గెలిచిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. స్థానిక వాటర్‌ ట్యాంక్‌ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో వర్తమాన సినీ నటుడు వి.సాగర్‌, డాన్స్‌ మాస్టర్‌ వి.రాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ పి.రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్‌ హీరోగా నటించిన రోమాన్టిక్‌ లైఫ్‌ సినిమాలోని రెండు గేయాలు విడుదల చేశారు. డివైఎఫ్‌ఐ పూర్వ జిల్లా కార్యదర్శి పెద్దింశెట్టి రామకృష్ణ, ప్రజా నాట్యమండలి నాయకులు జుత్తుగ శ్రీనివాసరావు, జెవివి నాయకులు యుఎస్‌ఎన్‌.రెడ్డి మాట్లాడారు. కళాకారుల సంఘం నాయకులు అనపర్తి ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన సభలో మురళి, చింతాకుల రాజు డివైఎఫ్‌ఐ గ్రామ కార్యదర్శి లోవరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు ప్రవీణ్‌, సాయి నిఖిల్‌, సాయి వెంకట్‌, డి.శ్రీనివాస్‌, వినరు, విజరు, సతీష్‌, పార్ధు, కోటేశ్వరరావు, బాలాజీ పాల్గొన్నారు. సామర్లకోట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక విశ్వ బ్రాహ్మణ కమ్యునిటి హాలులో నిర్వహించిన కార్యక్రమంలో సినీ దర్శకులు కెబి.ఆనంద్‌, హైకోర్టు న్యాయవాది వనమోజు సత్యరవికుమార్‌, తదితరులు విజేతలకు బహుమతులు అందించి అభినందించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఉమాసుందరి, కర్రి సత్యవెంకటేష్‌, విజరపు ప్రకాశరావు పాల్గొన్నారు. అలాగే 23వ వార్డులో వైసిపి నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు సేపేని శ్రీరూప, కౌన్సిలర్‌ సేపేని సురేష్‌ల ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి ఐశ్వర్య మహిళా కళాశాల కరెస్పాండెంట్‌ కరణం శ్రీనివాస్‌, కర్రి బాబురావు, బావిశెట్టి భద్రరావు, మార్తాల సంజు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. తొండంగి మండలంలోని గడ్డిపేట గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎంఎల్‌ఎ యనమల దివ్య బహుమతులు అందజేశారు. టిడిపి అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు రాజేష్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో సిసి రోడ్డును ఎంఎల్‌ఎ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ కాశీ విశ్వేశ్వరరావు, వెంకటరమణ, కేశవ్‌, మహంకాళి, రాజబాబు, రాంబాబు, ఎ.నరసింహమూర్తి, కె.మల్లేష్‌, పి.శ్రీను పాల్గొన్నారు.

➡️